Share News

పట్నం నుంచి పల్లెకు పయనం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:25 AM

దసరా సెలవులతో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూళ్ల ్లబాట పట్టారు. పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు కాలేజీలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు పల్లెలకు బయలుదేరడంతో ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలతోపాటు కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాలు రద్దీగా మారాయి.

పట్నం నుంచి పల్లెకు పయనం
Dasara Holidays Traffic Jam

  • ఎన్‌హెచ్‌-65పై వాహనాల బారులు

  • దసరా సెలవులకు హైదరాబాద్‌

  • నుంచి సొంతూళ్లకు విద్యార్థులు

  • ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు..

హైదరాబాద్‌ సిటీ/ కేపీహెచ్‌బీ కాలనీ/చౌటుప్పల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులతో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూళ్ల ్లబాట పట్టారు. పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు కాలేజీలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు పల్లెలకు బయలుదేరడంతో ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలతోపాటు కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాలు రద్దీగా మారాయి. శనివారం నుంచి ఈ నెల 22 వరకూ 13 రోజుల దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రమే సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ ప్రయాణికులతో నిండిపోయింది. మరోవైపు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత వాసులు సొంతూళ్లకు బయలు దేరడంతో యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వాహనాలు బారులు తీరాయి.


చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం సమీపంలోని వినాయక దేవాలయం నుంచి చౌటుప్పల్‌లోని బస్టాండ్‌ వరకూ 6 కి.మీ దూరం ఒక్కో వాహనం దాటడానికి 60 నిమిషాల సమయం పట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులనెదుర్కొన్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్లపైనే బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూశారు. ఇక ఎల్‌బీ నగర్‌ నుంచి రద్దీకనుగుణంగా బస్సుల్లేకపోవడంతో ప్రజలు పడిగాపులు కాశారు. హాస్టల్‌ విద్యార్థుల రాకతో రాత్రి వేళ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.


శని, ఆదివారాల్లో ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా, ప్రయాణికుల డిమాండ్‌కు సరిపోవడం లేదు. రైళ్లలోనూ టికెట్‌ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల డిమాండ్‌కనుగుణంగా ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు గంటగంటకూ టికెట్‌ ధర రెండింతలు మూడింతలు పెంచేస్తున్నా, వారిని కట్టడి చేయడంలో రవాణాశాఖ అధికారులు విఫలం అవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొందామన్నా కరెంటేదీ?
కరువు కోరల్లో 130 మండలాలు

ఎల్‌నినోపై సీఎం ఫోకస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:25 AM