Share News

ఎల్‌నినోపై సీఎం ఫోకస్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:11 AM

రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు.

ఎల్‌నినోపై సీఎం ఫోకస్‌
Revanth Reddy

  • 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం

  • ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చ

  • ఇప్పటికే కేంద్రాన్ని రూ.20 వేల కోట్ల..

  • సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. దీనిపై ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై వారితో చర్చించనున్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్తు డిమాండ్‌, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.


రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంతోపాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేసింది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. మంత్రులతో నిర్వహించే సమావేశంలో వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై చర్చించే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి:

కొందామన్నా కరెంటేదీ?
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
పురపాలక శాఖకు రూ.5 వేల కోట్ల విదేశీ రుణంRead Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:57 AM