పురపాలక శాఖకు రూ.5 వేల కోట్ల విదేశీ రుణం
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:51 AM
తెలంగాణలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది. ఇటీవల పురపాలక శాఖ ప్రతిపాదించిన ...
రూ.7,143 కోట్లతో వాతావరణ అనుకూల పట్టణాల అభివృద్ధి
తెలంగాణ-క్రూటీ పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది. ఇటీవల పురపాలక శాఖ ప్రతిపాదించిన తెలంగాణ క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్(తెలంగాణ-క్రూటీ) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కోసం జర్మనీకి చెందిన కేఎ్‌ఫడబ్ల్యూ బ్యాంకు ద్వారా రూ.5000 కోట్ల విదేశీ రుణం పొందేందుకు మార్గం సుగుమం అయిందని పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి తెలిపారు.
రూ.7143 కోట్ల అంచనా వ్యయంతో వాతావరణ అనుకూల పట్టణాల అభివృద్ధి క్యాక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమ లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించామని, దీంతో నిధుల సేకరణకు కేంద్ర ఆమోదం తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర వాటా రూ.2,143 కోట్లు
తెలంగాణ-క్రూటీ కార్యక్రమం కింద మొత్తం వ్యయం రూ.7143 కోట్లు కాగా, ఇందులో కేఎ్‌ఫడబ్ల్యూ రుణం రూ.5000 కోట్లు రానుండగా.. మిగతా రూ.2143 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భరించనుందని టీకే శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర పట్టణ అభివృద్ధి, గృహనిర్మాణ శాఖ.. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలనకు పంపినట్లు చెప్పారు. ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేసి సాంకేతిక పరిశీలన అనంతరం జపాన్ బ్యాంకుతో రుణ ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించిందని వెల్లడించారు.
నీతి ఆయోగ్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిందన్నారు. పట్టణ పాలనలో సంస్కరణలు, ప్రాజెక్టులకు స్పష్టమైన ప్రాధాన్యత, సంస్కరణల ఆధారిత ప్రొత్సాహకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించగా వాటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మరోవైపు.. గ్రేటర్ వరగంల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో సమగ్ర మురుగునీటి వ్యర్థ జలాల నిర్వహణ పథకానికి సుమారు రూ.5257 కోట్లతో అంచనాలు ప్రతిపాదించినట్లు టీకే శ్రీదేవి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News