Share News

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:32 AM

హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-పుణె హైస్పీడ్‌ రైలు కారిడార్లకు సంబంధించిన అలైన్‌మెంట్లు ఇంకా ఖరారు కాలేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు
Kishan Reddy

  • ఆ కారిడార్ల పేరిట ఇప్పుడు భూసేకరణ చట్టవిరుద్ధం

  • అలైన్‌మెంట్‌ తేలాకే భూసేకరణ చేయాలి

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-పుణె హైస్పీడ్‌ రైలు కారిడార్లకు సంబంధించిన అలైన్‌మెంట్లు ఇంకా ఖరారు కాలేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అలైన్‌మెంట్‌ ఖరారుకాక ముందే హైస్పీడ్‌ రైలు కారిడార్ల పేరిట భూసేకరణ చేపడితే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ రైల్వే కారిడార్లకు సంబంఽధించి శుక్రవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో అశ్వినీ వైష్ణవ్‌ చర్చించారు.


అలైన్‌మెంట్లు ఖరారుకాక ముందే భూసేకరణ జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోందని కిషన్‌రెడ్డి ప్రస్తావించగా.. రైల్వే మంత్రి వివరణ ఇచ్చారు. ఈ మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లకు సంబంధించి భూసేకరణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. ఈ కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం మార్గాన్ని నిర్ధారించే (అలైన్‌మెంట్‌) అధ్యయనాలు కొనసాగుతున్నాయని వివరించారు. అధ్యయనాలు పూర్తయి, మార్గాన్ని ఖరారు చేసిన తర్వాత.. అలైన్‌మెంట్ల పూర్తి వివరాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతులకు కూడా తెలియజేస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్నం నుంచి పల్లెకు పయనం
కరువు కోరల్లో 130 మండలాలు

ఎల్‌నినోపై సీఎం ఫోకస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:32 AM