హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ABN , Publish Date - Nov 23 , 2026 | 07:46 PM
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో రౌడీ షీటర్ ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులు, తల్వార్లతో గుర్తుతెలియని వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. హిమాయత్ సాగర్ ఎకో పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రాజేంద్రనగర్‌లో రౌడీ షీటర్ ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులు, తల్వార్లతో గుర్తుతెలియని వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. హిమాయత్ సాగర్ ఎకో పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ముర్తుజా పహిల్వాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా, .
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ముర్తుజా పహిల్వాన్‌పై రౌడీషీట్ ఉంది. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News