Share News

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 50 ఏళ్లు

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:36 AM

రాయలసీమ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 50 ఏళ్లు
Rayalaseema Express

  • మూడు రాష్ట్రాల గుండా ప్రయాణం

సికింద్రాబాద్: రాయలసీమ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవంతంగా 49ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని 50వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. అర్ధ దశాబ్దం పాటు పేదల బండిగా ఈ రైలుకు పేరుంది. 1977వ సంవత్సరంలో ఈ రైలు ప్రారంభమైంది. అప్పట్లో మీటర్‌ గేజీ పట్టాలపై సింగిల్‌ లైన్‌లో సామాన్యులకు అందుబాటులో ఉండేది.


city6,2.jpgకాలక్రమంలో ప్రయాణికుల రద్దీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ (నాంపల్లి) దక్కన్‌ నుంచి నిజామాబాద్‌కు పొడిగించారు. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ ఫాస్ట్‌గా ఆప్‌గ్రేడ్‌ చేసి ఆధునిక ఇంజన్లతో ప్రయాణం సాగిస్తోంది. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల మీదుగా 890 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అనునిత్యం కొనసాగిస్తోంది.


తరాలు మారుతున్నా, ఎన్నో కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నా ఈ రైలుకున్న ఆదరణ తగ్గలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మూడు రాష్ర్టాల ప్రజలకు ఆత్మీయ సేవలందిస్తోంది. కాగా, వికారాబాద్‌ జిల్లా తాండూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‏తో ఇక్కడి ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

కాచిగూడ-అశోకాపురం ఎక్స్‏ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 11:36 AM