Share News

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన

ABN , Publish Date - Aug 27 , 2026 | 10:36 AM

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనలు జారీ చేశారు. ఆ జిల్లాలు వివరాలిలా..

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని 8 జిల్లాల్లో ఈరోజు (గురువారం) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణలో చెదురుమదురు వానలు పడే అవకాశమున్నట్టు తెలిపారు.

కాగా.. రాష్ట్రంలో ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పారు.


ఇవీ చదవండి:

అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి

అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్

Updated Date - Aug 27 , 2026 | 10:37 AM