Share News

అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 27 , 2026 | 08:20 AM

అనంతపురం హైవేపై ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి

అనంతపురం, ఆగస్టు 27: రాయదుర్గం-అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాఘవేంద్ర, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.


గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


ఇవీ చదవండి:

ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. ఏడుగురి మృతి, 10 మందికి గాయాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు

Updated Date - Aug 27 , 2026 | 08:36 AM