ఇఫ్తార్ మాదిరిగా హిందువులకు ప్రత్యేక కార్యక్రమాలేవి: రాజాసింగ్
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:07 PM
హిందు పండుగలు, ముస్లింల పండుగల మధ్య తెలంగాణ ప్రభుత్వం తేడాలు ఎందుకు చూపిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసేలా చూడాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): హిందు పండుగలు, ముస్లింల పండుగల మధ్య తెలంగాణ ప్రభుత్వం తేడాలు ఎందుకు చూపిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా కాంగ్రెస్ సర్కార్ ప్రకటన చేసేలా చూడాలని కోరారు. రంజాన్ కోసం ఇఫ్తార్ మాదిరిగా హిందువుల కోసం నవరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల ఓట్ల కోసం ఇఫ్తార్ వేడుకలను చేసే నేతలకు హిందువుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ముస్లింల ఓట్ల గురించి టోపీ పెట్టుకొనే రాజకీయ పార్టీలకు హిందువులు బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News