Share News

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌

ABN , Publish Date - May 10 , 2026 | 03:52 PM

రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌
CM Revanth Reddy

హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. రాష్ట్రంలో 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) హెచ్‌ఐసీసీలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రపోజల్స్ రూపొందించామని.. రెండు గంటల సమయం వెచ్చించి స్పెషల్ రివ్యూ చేయాలని ప్రధాని మోదీని కోరారు. తమ ప్రపోజల్స్‌కి ప్రధాని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ చెబుతుంటారని పేర్కొన్నారు.


మోదీ పెద్ద మనసుతో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దేశం గురించి చర్చ వచ్చినపుడు తాము రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. 10 శాతం జీడీపీ తెలంగాణ నుంచి ఇచ్చే బాధ్యత తమదని చెప్పుకొచ్చారు.మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్‌కు మోదీ సహకరించాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని.. ఇకపై రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రధాని మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణను నెంబర్‌వన్‌ చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు తెలంగాణ కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

మోదీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయి: రామచందర్‌రావు

యువత నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 10 , 2026 | 04:09 PM