మోదీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయి: రామచందర్‌రావు
ABN , Publish Date - May 08 , 2026 | 12:50 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు (Ramchander Rao) వ్యాఖ్యానించారు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సభ ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. పరేడ్ గ్రౌండ్‌లో మోదీ హాజరయ్యే సభ ఏర్పాట్లను ఇవాళ (శుక్రవారం) రామచందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రాధాన్యం..
ఈరోజు నుంచి రెండు రోజులపాటు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు అన్ని కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్తాయని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ముందు మోదీ సభ జరగడం తమ పార్టీకి కలిసి వచ్చే అంశమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రాధాన్యం చాలా ఉందని ఉద్ఘాటించారు. రెండు లక్షలకు పైగా మందితో ఈ సభ సక్సెస్ కాబోతుందని అన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు స్వచ్చందంగా మోదీ సభ కోసం తరలి వస్తున్నారని తెలిపారు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశామని రామచందర్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్
రైతుబంధు ఎగ్గొట్టింది బీఆర్ఎస్.. ఇచ్చింది రేవంత్ సర్కార్: తుమ్మల
రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ
Read Latest Telangana News And AP News And International News And Telugu News