Share News

వీధి కుక్కల దాడులపై హెచ్‌ఆర్సీ సీరియస్

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:38 PM

వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. రెండు ఘటనలపై సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరించింది.

వీధి కుక్కల దాడులపై హెచ్‌ఆర్సీ సీరియస్

హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. రెండు ఘటనలపై సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మూడేళ్ల బాలిక దివ్య బెహరాను పంట పొలాల్లోకి వీధి కుక్కలు లాకెళ్లి పీక్కుతున్నాయని హెచ్‌ఆర్సీ ఆవేదన వ్యక్తం చేసింది. విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేయడంతో బాలిక మృతిచెందిందని ప్రస్తావించింది.


మరో ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగరాజు అనే మరో వ్యక్తిపై వీధికుక్కలు దాడి చేశాయని హెచ్‌ఆర్సీ వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే హక్కు ఉల్లంఘన జరిగిందని తెలిపింది. ఈ ఘటనల్లో సంబంధిత స్థానిక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమికంగా భావించింది. ప్రజల భద్రత, వలస కార్మికుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వాస్తవ పరిస్థితులు, తీసుకున్న చర్యల వివరాలను నివేదిక సమర్పించాలని పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లకు మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి

నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 07:18 PM