Share News

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:04 PM

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాసంగిలో తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత: మంత్రి తుమ్మల
Telangana Minister Tummala Nageswara Rao

హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. యాసంగిలో తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు. స్వల్పకాలిక.. తక్కువ పెట్టుబడి పంటలను ఎంచుకోవాలని నిర్దేశించారు. ఈరోజు (శనివారం) సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును అన్నదాతలు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రైతు నేస్తం 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. NFSM, NMEO-OS పథకాల కింద విత్తనాలను పంపిణీ చేస్తునట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నీటి పారుదల ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.


పంటలకు స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించేందుకు చర్యలు...

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను రైతన్నలు ఎంచుకోవాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. వేరుశనగలో నూతన విత్తన రకాలను అభివృద్ధి చేయాలని చెప్పుకొచ్చారు. ఇతర పంటలకు స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయిల్‌పామ్ గెలలను వేగంగా ఫ్యాక్టరీలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్నదాతలకు చెల్లింపులను త్వరితగతిన జరిగేలా చూస్తామని మాటిచ్చారు. నూనెగింజల విత్తనాల కోసం రూ.49.35 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.34.55 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 52,425 ఎకరాలకు 29,375 క్వింటాళ్ల విత్తనాలను ధ్రువీకరించినట్లు తెలిపారు.


కొన్ని రకాల విత్తనాలకు వందశాతం సబ్సిడీ..

రూ.36.76 కోట్ల సబ్సిడీతో నూనెగింజల విత్తనాలను పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల అన్నారు. వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వుల విత్తనాలను పంపిణీ చేస్తామని వివరించారు. పప్పుధాన్యాల కోసం రూ.34.60 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 21 జిల్లాల్లో 29,008 క్వింటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తామని అన్నారు. శనగ, మినుము, పెసర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేస్తామని చెప్పారు. విత్తనాలకు 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని రకాల విత్తనాలకు వందశాతం సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 04:31 PM