Share News

పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Aug 11 , 2026 | 02:33 PM

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల
Telangana Minister Thummala Nageswara Rao

హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Thummala Nageswara Rao) ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. 2026-27 సీజన్‌లో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు అంచనా వేశామని తెలిపారు. ఈరోజు (మంగళవారం) సీసీఐ అధికారులతో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తిని అంచనా వేస్తున్నామని చెప్పారు. లాంగ్ స్టేపుల్ కాటన్‌కు రూ.8,667 ఎంఎస్పీ ధర ఉందని అన్నారు. గతేడాదితో పోలిస్తే రూ.557ల ఎంఎస్పీ ధర పెరిగిందని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు 122 నుంచి 131కు పెంచారని వెల్లడించారు.


జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలి..

తెలంగాణలో 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. 15 నుంచి 30 రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ మిల్లులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతుల ప్రతినిధులతో జిల్లా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. మధ్యవర్తుల జోక్యానికి తావులేకుండా నేరుగా పత్తి కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ మరింత సరళీకరణ చేస్తున్నట్లు వివరించారు. అధిక దిగుబడి రైతులకు వెంటనే డిజిటల్ Yield Certificates ఇస్తున్నట్లు వెల్లడించారు. జిన్నింగ్ మిల్లుల్లో నాణ్యత పరీక్ష పరికరాలు తప్పనిసరని పేర్కొన్నారు.


సీసీటీవీలు, బరువు యంత్రాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..

కొనుగోలు కేంద్రాల్లో సీసీటీవీలు, బరువు యంత్రాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తుమ్మల చెప్పారు. రద్దీ, పెండింగ్ ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు ఫిర్యాదులు చేయడానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 599 5779, వాట్సాప్ చాట్‌బాట్: 88972 81111లో సంప్రదించాలని సూచించారు. అన్నదాతకు ఎంఎస్పీ ధర అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.


వార్తలు కూడా చదవండి...

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 03:16 PM