నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత
ABN , Publish Date - Aug 03 , 2026 | 10:28 AM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు (Ujjaini Mahankali Bonalu Festival) నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుకోవటానికి భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఈరోజు (సోమవారం) రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) వినిపించారు. పలు అంశాల గురించి ఆమె భవిష్యవాణి వినిపించారు. రంగం భవిష్యవాణి అనంతరం బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం అమ్మవారిని అంబారీపై ఊరేగించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నేను క్రోధంగా వచ్చా..
ప్రశ్న: ఘటాల ఊరేగింపు నుంచి బోనాలు, షాకలు సమర్పించారు సంతోషమా..?
మాతంగి స్వర్ణలత:
మౌనంగా ఉన్న మాతంగి స్వర్ణలత..
ఎందుకు చెప్పాలి, నేను సంతోషంగా రాలేదు, క్రోధంగా వచ్చా, ఎందుకు సమాధానం చెప్పాలి.
నా మాటలు ఆచరించనప్పుడు ఎందుకు సమాధానాలు చెప్పాలి.
రెండు మాసాలు అయిపోయాయి, విగ్రహ ప్రతిష్ఠ చేయడం లేదు.
నా ఆగ్రహానికి గురవుతున్నారు..
ఆపదలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా కాపాడుతున్నా.
నా మాట ఆచరించడం లేదు.
అడ్డుపుల్ల వేసిన తొలగిస్తా, ఎవరు అడ్డొచ్చిన తీసుకుపోతా.
నేను ఊరుకోను, విగ్రహ ప్రతిష్ఠ చేయాలి.
ఈ ఏడాది కుంభవర్షాలు..
ప్రశ్న: ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు ఉన్నాయా..?
మాతంగి స్వర్ణలత:
గత ఏడాది చెప్పినట్లుగా ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
అగ్నిప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
జనాలు జాగ్రత్తగా ఉండాలి.
సగానికి సగం కొట్టుకుపోతారు.
ఈ ఏడాది ప్రమాదాలు అధికం.
ఈ ఏడాది ఎక్కువగా ప్రాణానష్టాలు ఉంటాయి.
వావివరుసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారు.
నాకు సంతోషం లేకుండా చేస్తున్నారు.
యువత శ్రేయస్సుపై..
ప్రశ్న: యువత మంచిగా చూసే బాధ్యత నీదే తల్లి, పిల్లలను సరైన వరుసలో పెట్టాలి.
మాతంగి స్వర్ణలత:
ఈ ఏడు నేను మాట్లాడేది చాలా ఉంది.
సరైన దారిలో నేను పెడుతున్నాను.
తల్లిదంద్రులు ఊరిమీద వదిలేస్తున్నారు.
ఈ ఏడు సంతోషంగా ఉండటానికి, కోపంగా ఉండటానికి కారణం ఉందని మాతంగి స్వర్ణలత పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News