హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆ కంపెనీల్లో ఒక్కసారిగా మంటలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:27 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్బెస్టాస్ కాలనీలోని పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్బెస్టాస్ కాలనీలోని పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. GRT Ghee, Haldiram గోడౌన్లకు కూడా మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న పలు కంపెనీలకు కూడా అంటుకున్నాయి.
అగ్నిప్రమాదంలో ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇప్పటికే మూడు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందగానే ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News