హైదరాబాద్‌లో గంజాయి మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:10 PM
హైదరాబాద్‌లో పోలీసులు ఈరోజు పలు ప్రాంతాల్లో విసృత్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. సరుకును రవాణా చేస్తున్న పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో పోలీసులు ఈరోజు (ఆదివారం) పలు ప్రాంతాల్లో విసృత్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. సరుకును రవాణా చేస్తున్న పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు..
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. SOT ఉప్పల్ జోన్, నాచారం పోలీసుల సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల నుంచి 60.380 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరుకు రవాణాకు ఉపయోగించిన ఫియట్ లీనియా కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలో అధిక ధరకు గంజాయి విక్రయం..
అలాగే, నాచారం - చిలుకానగర్ రోడ్డులోని స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులోని డిక్కీలో నాలుగు గోనె సంచుల్లో 60 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఒడిశాలో కిలో రూ.2 వేల చొప్పున సరుకును కొనుగోలు చేసి హైదరాబాద్, ముంబైలో అధిక ధరకు విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో ట్రిప్‌నకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఇస్తామని నిందితులకు.. ప్రధాన నిందితుడు ఆశ చూపించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. గంజాయి మూలాలు, ఆర్థిక లావాదేవీలు, డెలివరీ నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు..
అలాగే, హైదరాబాద్‌లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలో మూడు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 3.079 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో 2.1 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మహబూబ్ ఖాన్ వద్ద సరుకుతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూసుఫ్‌గూడలో 560 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సయ్యద్ షాదాబ్ (20) వద్ద గంజాయి, యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. మౌలాలిలో 419 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. వరాల మహేందర్ (37) వద్ద గంజాయి, బైకును స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో నిందితులు, వాహనాలను సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లకు పోలీసులు అప్పగించారు. రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, డీటీఎఫ్ బృందాల తనిఖీల్లో ఈ గంజాయిని పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News