Share News

పెండింగ్ అప్రోచ్ రోడ్ల పనులకు సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:52 PM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్‌ఫ్రా అండ్ క్యాపిటల్ వర్క్స్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

పెండింగ్ అప్రోచ్ రోడ్ల పనులకు సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
Cabinet Sub Committee Meeting

హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అధ్యక్షతన ఇన్‌ఫ్రా అండ్ క్యాపిటల్ వర్క్స్ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.148 కోట్లకు ఆమోదం తెలిపింది. బ్రిడ్జిలు ఉన్నా అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా మారాయని కేబినెట్ దృష్టికి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.


1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సరైన ప్రతిపాదనలు ఉంటే త్వరితగతిన ఆమోదించాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. జూన్ 8వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్గనిర్దేశం చేశారు. ప్రతి వారం పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. టెండర్లు, పనుల నాణ్యతపై కఠిన పర్యవేక్షణ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 07:54 PM