బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోంది.. మహేశ్ గౌడ్ ధ్వజం
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:21 PM
మోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, జూన్11, (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. గృహిణులను ఇబ్బంది పెట్టేలా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (గురువారం) ఢిల్లీ వేదికగా మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయ కక్షతోనే ఆ నామినేషన్ తిరస్కరణ..
దేశవ్యాప్తంగా జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఏఐసీసీ సమావేశంలో చర్చించామని మహేశ్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో ఎక్కడా మీనాక్షి నటరాజన్‌పై కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా మహిళా అని కూడా చూడకుండా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News