Share News

SIRపై బీఆర్‌ఎస్ మౌనం.. బీజేపీతో లోపాయికారి ఒప్పందమంటూ మహేశ్ ఫైర్

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:01 PM

బీఆర్‌ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. SIR ఆందోళనలో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. సీఈసీ తప్పిదం చేస్తుంటే హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.

SIRపై బీఆర్‌ఎస్ మౌనం.. బీజేపీతో లోపాయికారి ఒప్పందమంటూ మహేశ్ ఫైర్
Mahesh Kumar Goud

హైదరాబాద్, అక్టోబర్ 9: బీఆర్‌ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. SIR ఆందోళనలో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. సీఈసీ తప్పిదం చేస్తుంటే హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. నిరసన కార్యక్రమం ఎందుకు చేయడం లేదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ-ఫార్ములా కేసులో అరెస్ట్ చేస్తారని, కాళేశ్వరం కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందని భయమా అని ప్రశ్నించారు. ఉండటానికి ఇల్లు లేదన్న కేటీఆర్‌కు ఫైవ్‌స్టార్ హోటల్స్ ఎలా వచ్చాయని.. ఆయనకు ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. SIR ప్రక్రియపై దేశ వ్యాప్తంగా బీజేపీ, మిత్ర పక్షాలు తప్ప అన్ని పార్టీలు రోడ్డెక్కాయన్నారు.


జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించే వరకు నిరసన

‘సర్’లో దళితుల, మైనారిటీ, గిరిజనుల ఓట్లు తొలగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాల పేరుతో మమత బెనర్జీని, బిహార్‌లో ఆర్జేడీని గెలవకుండా ఆపారన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించే వరకు నిరసన ర్యాలీలు కొనసాగుతాయని మహేశ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారని తెలిపారు. శాశ్వతంగా అధికారంలో ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తొలగించారని.. జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి తొత్తులను సీఈసీగా పెట్టుకుందని బీజేపీపై విరుచుకుపడ్డారు.


ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఫైర్

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడే దాంట్లో నిజం లేదన్నారు. SIR అంశంలో మొదట స్పందించింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. అర్హుల ఓట్లు కాపాడటమే తమ లక్ష్యమన్నారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని.. సామాజిక అంశాలపై ఆయన స్పందిస్తారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓట్లు కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

రైతులకు కరెంట్ ఇవ్వకుంటే నిరసన ఢిల్లీకి చేరుతుంది: కొత్త ప్రభాకర్ రెడ్డి

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 03:06 PM