Share News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:39 PM

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఇండియా కూటమి ఎంపీలపై కేంద్రం పోలీసుల ద్వారా రాజ్యం ఏలుతోందని విమర్శించారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
MP Mallu Ravi

ఢిల్లీ, అక్టోబర్ 9: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఇండియా కూటమి ఎంపీలపై కేంద్రం పోలీసుల ద్వారా రాజ్యం ఏలుతోందని విమర్శించారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులతో భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీల సమావేశం జరుగనుందని తెలిపారు.


ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని ఎంపీ అన్నారు. తప్పు చేసిన జ్ఞానేష్ కుమార్, తప్పు చేయించిన మోదీ, అమిత్ షా శిక్షకు అర్హులని వ్యాఖ్యానించారు. ఆందోళనలు అణచివేయడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి 7 వేల మంది బలగాలను ఢిల్లీకి తీసుకొచ్చారని మండిపడ్డారు. సీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తామని చెప్తే ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ నిరసన చేయకుండా అడ్డుకోవాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులు.. 40శాతం అదనపు ఛార్జీలు

రైతులకు కరెంట్ ఇవ్వకుంటే నిరసన ఢిల్లీకి చేరుతుంది: కొత్త ప్రభాకర్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 01:41 PM