బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ: మంత్రి సత్యప్రసాద్
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:59 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా వారికి న్యాయం చేస్తామని అన్నారు.
అమరావతి, అక్టోబర్ 09: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా వారికి న్యాయం చేస్తామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బీసీలకు పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు.
బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగకూడదని కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. అందుకే వారికి 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారంటూ జగన్‌పై మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. వారి హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుందని.. వారి అభ్యున్నతికి కట్టుబడి టీడీపీ ఉంటుందని అన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గొడ్డలి పార్టీ చూస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్
‘సర్’పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
Read Latest AP News And Telugu News