బీసీలకు 34 శాతం టికెట్లు ఇచ్చి తీరుతాం: గల్లా మాధవి
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:03 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కేటాయించేందకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి స్పష్టం చేశారు. సాంకేతికంగా ఇబ్బంది వచ్చినా... పార్టీ పరంగా బీసీలకు 34 శాతం టిక్కెట్లు ఇస్తుందని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 9: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కేటాయించేందకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతికంగా ఇబ్బంది వచ్చినా... పార్టీ పరంగా బీసీలకు 34 శాతం టిక్కెట్లు ఇస్తుందని తెలిపారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసింది చంద్రబాబే అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అనేది మరిచిపోవద్దన్నారు. బీసీలకు ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే గొడ్డలి పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్‌కు అనుకూలంగా వాదనలు వినిపించిన న్యాయవాది వైసీపీ ప్రభుత్వంలో ఏజీపీగా వ్యవహరించారని మాధవి తెలిపారు. వైసీపీ నేతే బీసీలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తోంటే ఎందుకు ఆ పార్టీ ఆపలేదో సమాధానం చెప్పాలన్నారు. బీసీలను రాజకీయంగా వాడుకోవడమనేది గొడ్డలి పార్టీకి అలవాటని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చేసిన స్కాంలకు వైసీపీ బీసీ నాయకులను రక్షణగా పెట్టుకున్నారన్నారు. గొడ్డలి పార్టీ వల్ల అనేక మంది బీసీ నేతలు కేసుల్లో ఇరుక్కున్నారని.. గత ప్రభుత్వం బీసీ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. బీసీలకు గొడ్డలి పార్టీ చేసిన ద్రోహాన్ని బీసీలు మరిచిపోలేదని... మరిచిపోరని గల్లా మాధవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా, ఒకరి మృతి
నెల్లూరులో ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
Read Latest AP News And Telugu News