Share News

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:30 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు
Shamshabad Airport Leopard Sighting

హైదరాబాద్‌, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. చిన్మయ స్కూల్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.


అంతకుముందు.. శంషాబాద్ ఎయిర్​​‌పోర్ట్ పరిసరాల్లోని చిన్మయ స్కూల్ సమీపంలో చిరుత కనిపించిందంటూ ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విమానాశ్రయ అధికారులు వెంటనే వన్యప్రాణి నిర్వహణ, జూ అధికారులకు సమాచారం అందించి, వారితో సమన్వయమయ్యారు. సురీర్ఘ పరిశీలన అనంతరం అక్కడ చిరుత ఆనవాళ్లేవీ లేవని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 03:21 PM