కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ABN , Publish Date - May 14 , 2026 | 04:34 PM
మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. నందినగర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్, మే14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని (KTR) భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. నందినగర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీతో సమావేశం అయ్యారు. పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ప్రస్తావించారు.

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కేటీఆర్‌తో ఈ అంశంలో అనేక అంశాలపై చర్చించారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన మైత్రిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా తీసుకునే చర్యలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ భేటీపై సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ భాగస్వామ్యం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు, సాంస్కృతిక బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News And Telugu News