Share News

మహిళా రిజర్వేషన్లకు మేము మద్దతు ఇచ్చాం: కేటీఆర్

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:22 PM

డీలిమిటేషన్‌పై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండకూడదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు.

మహిళా రిజర్వేషన్లకు మేము మద్దతు ఇచ్చాం: కేటీఆర్
KTR

హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌పై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండకూడదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, సీట్లను 50 శాతం పెంచాలనే ప్రతిపాదన తమ ప్రధాన ఆందోళనను పరిష్కరిస్తోందని చెప్పుకొచ్చారు. దీనివల్ల తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా, తమ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు తాము ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చామని, దాని అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


మహిళా రిజర్వేషన్లను బీఆర్ఎస్ సమర్థిస్తోంది: ఎంపీ‌ వద్దిరాజు రవిచంద్ర

Vaddiraju-RaviChandra-1.jpg

తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 12ఏళ్లు ఆలస్యమైందని ఎంపీ‌ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. మహిళా రిజర్వేషన్లను బీఆర్ఎస్ మొదటి నుంచీ సమర్థిస్తోందని చెప్పుకొచ్చారు. ఈరోజు (శనివారం) తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ 2014లోనే అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని ప్రస్తావించారు. రాజ్యసభలో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలం డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కూడా పోరాటం చేస్తామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌పై తాము పోరాటం చేస్తామని అన్నారు.


రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా పెరగాలి..

రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా పెరగాలని, అక్కడ కూడా మహిళల రిజర్వేషన్లు అమలు కావాలని ఎంపీ‌ వద్దిరాజు ఆకాంక్షించారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలని... ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలుసునని చెప్పారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నిసార్లు కలిశారని... రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు కలిశారో చూస్తున్నామని అన్నారు. ప్రధానిని కలిసి రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని... సొంత ప్రయోజనాలు తప్ప అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకి ఎవరు బీ టీం అన్న విషయం అందరికీ తెలుసునని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు 2029 ఏప్రిల్‌లో వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారని.. దీనిని బట్టి బీజేపీతో ఎవరికి అవగాహన ఉందో అందరికీ అర్థం అవుతోందని ఎంపీ‌ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 07:40 PM