నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:14 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. కొత్తగా ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ప్రారంభించాలని నిశ్చయించింది. ఈ పథకం అమలు చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. తొలి ఏడాది 7 వేల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీసా, విమాన ప్రయాణం, విదేశీ భాషా శిక్షణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీని కల్పించనుంది.
మొదటి కేటగిరీకి గరిష్ఠంగా రూ.50 వేల వరకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం చేయనుంది. రెండో కేటగిరీకి గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనుంది. 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించనుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువతకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
నిర్మాణం, తయారీ, ఆటోమొబైల్, వైద్య, హోటళ్లు సహా పది రంగాల్లో ఉద్యోగావకాశాలను ప్రభుత్వం కల్పించనుంది. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన భాషా, నైపుణ్య శిక్షణను టామ్‌కామ్ అందించనుంది. ఒక రేషన్ కార్డుపై కుటుంబంలోని ఒక్కరికే మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. టామ్‌కామ్ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌రెడ్డి
‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం
పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News