Share News

లంబాడాలను ఎస్టీల్లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌ది: సీఎం రేవంత్‌‌రెడ్డి

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:49 PM

లంబాడాలను ఎస్టీల్లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.

లంబాడాలను ఎస్టీల్లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌ది: సీఎం రేవంత్‌‌రెడ్డి
Telangana CM Revanth Reddy

నాగర్‌కర్నూల్‌ జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): లంబాడాలను ఎస్టీల్లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌‌రెడ్డి ఈరోజు (గురువారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి.. ఆలయంలో సీఎం రేవంత్‌ ప్రత్యేక పూజలు చేశారు.


అలాగే, మద్దిమడుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. లంబాడాల అభివృద్ధికి దోహదపడింది కాంగ్రెస్సేనని తెలిపారు. 10 లక్షలకుపైగా లంబాడాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. లంబాడాలకు 12 లక్షల ఎకరాలను పంచిపెట్టామని చెప్పుకొచ్చారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి

టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ

నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 06:29 PM