Share News

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:07 PM

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. రౌడీషీటర్లు, రాజకీయ అండతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand

కామారెడ్డి జిల్లా, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) హెచ్చరించారు. రౌడీషీటర్లు, రాజకీయ అండతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారితో బాండ్లు రాయించుకోవాలని పోలీసులకు సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.


ఈరోజు (శుక్రవారం) కామారెడ్డిలో డీజీపీ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీకి ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు విచ్చేసిన డీజీపీకి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ , ఎస్పీ రాజేశ్ చంద్ర పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజీపీ, కలెక్టర్, ఎస్పీలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పోలీసుల పనితీరుపై డీజీపీ ప్రశంసలు కురిపించారు.


గతంలో నక్సలైట్ల ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని డీజీపీ వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వ్యసనాలపై పోలీస్ సిబ్బందికి అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆజ్ఞాపించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్.. పునరావృతమైతే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. బాన్సువాడలో, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌‌రెడ్డి

‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 09:02 PM