Share News

ఆలస్యంగా ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:47 AM

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.

ఆలస్యంగా ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర
Khairatabad Bada Ganesh Shobha Yatra

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర (Khairatabad Bada Ganesh Shobha Yatra) ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బాహుబలి క్రేన్ పైప్ విరగడంతో ఈ సమస్య వచ్చింది. ఇంకా టస్కర్‌పైకి మహాగణపతి చేరుకోకపోవడంతో శోభాయాత్ర ఆలస్యం కానుంది. ప్రతి సంవత్సరం శోభాయాత్ర ముందు రోజు రాత్రి టస్కర్ పైకి బడా గణేశ్‌‌ను చేరుస్తారు.


కానీ ఈ ఏడాది బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపంతో ఆలస్యంగా వెల్డింగ్ పనులు జరిగాయి. క్రేన్‌లో సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం టస్కర్‌పైకి వినాయకుడు చేరనున్నారు. ఆ తర్వాత దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ వర్క్స్ కొనసాగనున్నాయి. గంట, రెండు గంటల పాటు ఆలస్యంగా ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర మొదలు కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 07:22 AM