కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. మారిన బస్సు రూట్లు
ABN , Publish Date - Aug 19 , 2026 | 10:59 AM
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది.
47ఎల్, 127కే, 10హెచ్ బస్సుల రూట్లను వెల్లడించిన ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో మార్పులు చేస్తూ, స్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మారిన బస్సు రూట్లు, స్టాప్‌ల ఆధారంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
బస్సు నంబరు 47 ఎల్ రాకపోకలు
సికింద్రాబాద్ నుంచి మణికొండ : సికింద్రాబాద్- బేగంపేట- నాగార్జున సర్కిల్ - ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ- ఒమేగా- అపోలో ఆస్పత్రి- ఫిల్మ్‌నగర్- దర్గా- మణికొండ
మణికొండ నుంచి సికింద్రాబాద్: మణికొండ- పంచవటికాలనీ, దర్గా- ఫిల్మ్‌నగర్ - జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్- టీవీ9 (మసీద్)- పంజాగుట్ట పీఎస్- ఆర్‌జే కాలేజీ- పోలీస్ లైన్- ప్లాజా- సికింద్రాబాద్.
బస్సు నంబరు 222
కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి- లక్డీకాపూల్- మాసబ్‌ట్యాంక్- నాగార్జున సర్కిల్- ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ-ఒమేగా- ఆపోలో ఆస్పత్రి- జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- పెద్దమ్మగుడి - మాదాపూర్ పీఎస్- పటాన్ చెరు.
పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు- మాదాపూర్ పీఎస్- పెద్దమ్మగుడి- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్- నాగార్జున సర్కిల్- మాసబ్‌ట్యాంక్ - లక్డీకాపూల్- కోఠి
బస్సు నంబరు 127
కోఠి నుంచి కొండాపూర్ : కోఠి- లక్డీకాకపూల్ - మాసబ్‌ట్యాంక్- పెన్షన్ ఆఫీస్ - ఎమ్మెల్యే కాలనీ- అపోలో ఆస్పత్రి- రోడ్డు నంబర్ 45 - మాదాపూర్ పీఎస్- కొండాపూర్.
కొండాపూర్ నుంచి కోఠి : కొండాపూర్- మాదాపూర్ పీఎస్- రోడ్డు నంబరు 45- జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహి ల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో - ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్ - బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ - పెన్షన్ ఆఫీస్- మాసబ్‌ట్యాంక్ - కోఠి.
బస్సు నంబరు 10 హెచ్
సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ :
సికింద్రాబాద్- బేగంపేట- మైత్రివనం- యూసుఫ్ గూడ ఎక్స్‌రోడ్- వెంకటగిరి- నవయుగా - పెద్దమ్మగుడి- మాదాపూర్ పోలీస్ స్టేషన్ - కొండాపూర్.
కొండాపూర్ నుంచి సికింద్రాబాద్:
కొండాపూర్- పెద్దమ్మగుడి- జూబ్లీచెక్ పోస్టు- వెంకటగిరి - యూసుఫ్ గూడ- మైత్రివనం-బేగంపేట- సికింద్రాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News