Share News

మూడో స్థానంపై చర్చలను కొట్టిపడేసిన పడిక్కల్

ABN , Publish Date - Aug 19 , 2026 | 10:18 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ క్రమంలో మూడో స్థానం విషయంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఈ అంశంపై పడిక్కల్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

మూడో స్థానంపై చర్చలను కొట్టిపడేసిన పడిక్కల్
Devdutt Padikkal

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్(167) అద్భుతమైన శతకం చేశాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత భారత తరఫున టెస్టుల్లో వన్ డౌన్ బ్యాటర్ సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్‌ గాయం కారణంగా దూరం కావడంతో వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ పడిక్కల్ సెంచరీతో మెరిశాడు. దీంతో మూడో స్థానంలో అద్భుతమైన ప్లేయర్ దొరికాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకక కొందరు అయితే సాయి సుదర్శన్‌తో పడిక్కల్‌ను పోలుస్తున్నారు.


వన్‌డౌన్ బ్యాటింగ్ విషయంలో వస్తున్న చర్చలపై పడిక్కల్ స్పందిస్తూ... తాను ఇలాంటి రేస్‌కు దూరంగా ఉంటానని.. అవకాశం వచ్చినప్పుడు ఏ స్థానంలోనైనా నిరూపించుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశాడు. మూడో స్థానం తనకు సుదీర్ఘం కాలం వచ్చేసినట్లు బయట చాలా చర్చ సాగుతోందని, కానీ, తనకు అలాంటివి ఇష్టం ఉండదని తెలిపాడు. ఎప్పుడు, ఏ స్థానంలో అవకాశం వచ్చినా సిద్ధంగా ఉంటానని, అంతేకానీ, ఎంపిక గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని పడిక్కల్ వెల్లడించాడు.


పోటీ ఎక్కువ ఉన్న సమయంలో ఇక్కడ ఆటే కొలమానమని, మనం బాగా ఆడకపోతే జట్టులో కొనసాగడం కష్టమని క్రీడల్లోనే కాదు.. ఉద్యోగంలోనూ అంతేని పేర్కొన్నాడు. సరైన ప్రదర్శన ఇవ్వకపోతే అవకాశాలు రావని, ఛాన్స్‌ వస్తే మాత్రం పరుగులు చేసేందుకు వందశాతం ప్రయత్నిస్తామని, అలా చేస్తే మరిన్ని మ్యాచులు ఆడొచ్చని తెలుసని పడిక్కల్‌ (Padikkal) తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

Updated Date - Aug 19 , 2026 | 10:29 AM