Share News

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:45 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్
Harish Rao

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు (Harish Rao) సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.


సనత్‌నగర్ టిమ్స్‌ ఆస్పత్రి సందర్శనకు సంబంధించి హరీశ్‌రావు పిలుపునివ్వడంతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ వార్తతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.


మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ హౌస్ అరెస్ట్..

Talasani Srinivas Yadav

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్‌లో నూతనంగా ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించాలని బీఆర్ఎస్ హై కమాండ్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు టిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, అడ్డుకునేందుకు తమను హౌస్ అరెస్ట్‌లు, అక్రమ నిర్బందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సనత్ నగర్, అమీర్‌పేట డివిజన్‌లకు చెందిన ముఖ్య నాయకులను పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ప్రశ్నించారు.


వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 10:41 AM