Share News

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:19 AM

H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఈ రోజు నుంచి ఈ పార్కు చుట్టూ వన్ వే చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.


వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం..

రెండు చోట్ల కాస్త ఇబ్బంది కలుగుతోందని.. దాన్ని కూడా క్లియర్ చేస్తామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ వాహనదారులు ముందుకెళ్లాలని సూచించారు. నాలుగు షిఫ్ట్‌లలో అధికారులు పనిచేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తారని తెలిపారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్లకి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వన్ వే విధానం కోసం ప్రజలందరూ సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేశారు. బస్టాప్‌లకు సంబంధిచి ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి

నటి అనసూయకు బిగ్ షాక్..

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 11:01 AM