కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు: పాక్ మతబోధకుడు
ABN , Publish Date - Aug 19 , 2026 | 10:09 AM
పాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రసంస్థ ఎల్‌ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్టు చెప్పాడు. దీంతో, కశ్మీర్‌లో ఉగ్ర నెట్‌వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
హఫీజ్ సయీద్ సారథ్యంలోని లష్కరే తొయిబా భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హఫీజ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. 26/11 దాడుల్లో మంది పాక్ ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబైలోకి ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. ఇక గతేడాది పహల్గాం దాడిలో 26 మంది సాధారణ పౌరులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జమ్మూలోని కోర్టు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఎల్‌ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం