కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:02 AM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ యువ ప్లేయర్ ఒకరు ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ సలహాల కారణంగా తన జీవితమే మారిందంటూ కృతజ్ఞతలు తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ క్లోహీకి సామాన్యులతో పాటు సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉన్నారు. అంతేకాక అతడు ఎంతో మందికి యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ఇక అంతర్జాతీయ, దేశవాళీ, ఇతర లీగ్స్ సమయంలో తన సహచరులకు విలువైన సలహాలు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే కోహ్లీ సలహాలతో తమలో మార్పులు వచ్చిందని అనేక మంది యువ క్రికెటర్లు తెలిపారు. తాజాగా ఇంగ్లండ్ యువ క్రికెటర్ కూడా కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మరి.. ఆ ప్లేయర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఓ ఇంటర్నేషనల్ ఛానల్‌తో ఇంగ్లండ్ యువ క్రికెటర్ జార్డన్ కాక్స్ మాట్లాడుతూ.. కోహ్లీ గురించి పలు విషయాలను వెల్లడించాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదని, అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్‌తో గడిపిన క్షణాలు తన జీవితాన్నే మార్చేశాయని కాక్స్ వెల్లడించారు.
క్రికెట్‌లో పెద్ద మ్యాచులు, అరంగేట్రం సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ తనకు అద్భుతమైన సలహా ఇచ్చాడని కాక్స్ తెలిపాడు. జీవితంలో ఒక్కసారే అరంగేట్రం వస్తుందని, మన కష్టపడిన వారి త్యాగాలను గుర్తుంచుకుని మైదానంలో ప్రతిభను చాటుకోమని కోహ్లీ ధైర్యం చెప్పినట్లు అతడు గుర్తుచేసుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరగాల్సిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌కు కేవలం మూడు రోజుల ముందు గాయపడటంతో కాక్స్ మానసికంగా కుంగిపోయాడు. ఆ సమయంలో ఇక క్రికెట్ ఆడలేనేమోనని భయపడిన తనకు కోహ్లీ చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇచ్చాయని కాక్స్ తెలిపాడు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో, బయట అంతకంటే వినయంగా, దయ ఉంటాడని అతడు పేర్కొన్నాడు. మైదానంలో అగ్రెసివ్‌గా ఉంటూనే, బయట వారితో ఎలా ప్రవర్తించాలనేది కోహ్లీని చూసి నేర్చుకున్నానని కాక్స్ వెల్లడించాడు.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం