తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:39 AM
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులతో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులతో ఓ గుడ్‌న్యూస్ షేర్ చేసుకున్నాడు. అతడి సతీమణి వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాక్స్‌వెల్ వెల్లడించాడు. తాను రెండోసారి తండ్రి అయ్యానని, వినీ పాప క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. దీంతో తోటి క్రికెటర్లు, క్రీడా ఫ్రాంచైజీలు, అభిమానులు మాక్స్‌వెల్ శుభాకాంక్షలు తెలిపారు.
2013లో భారత సంతతికి చెందిన వినీ రామన్, మాక్స్‌వెల్ తొలిసారి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. 2017లో తమ బంధాన్ని ప్రకటించి.. 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో వివాహం చేసుకున్నారు. మెల్‌బోర్న్ వేదికగా వినీ- మాక్సీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు 2023లో తొలి సంతానంగా కొడుకు జన్మించాడు. అతడికి లోగాన్ మార్వెరిక్ మాక్స్‌వెల్ అని నామకరణం చేశారు. తాజాగా కుమార్తె జన్మించగా.. ఆమెకు మియా మాక్స్‌వెల్‌గా పేరు పెట్టిన మాక్స్ వెల్ దంపతులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్