రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:52 AM
తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ఓ రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు.
రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, దాని లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రం, దేశంలో కరువు పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రకటించబోయే రాజకీయ ప్రణాళికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విజయవాడలో జరిగే ప్రకటనలో పార్టీ పేరు, విధివిధానాలు, రాజకీయ లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News