Share News

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:38 PM

కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.

 స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
PVN Madhav

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈరోజు (మంగళవారం) బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. దేశంలో గొప్ప ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు.


ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి గ్రామానికి వికాసం..

ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి గ్రామానికి వికాసం వచ్చిందని మాధవ్ తెలిపారు. ప్రతి ఊరులో బీజేపీ జెండా ఎగరాలని సూచించారు. ప్రతి గ్రామంలో వార్డు సభ్యుడు ఉండాలని సూచించారు. చైర్మన్‌లు, అన్ని పదవుల్లో మనం ఉండాలని తెలిపారు. పదవుల్లో ఉన్నవారంతా మళ్లీ ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మన్ కి బాత్‌ను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని తెలిపారు.


విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల బాటలో నడుస్తోంది..

విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల బాటలో నడుస్తోందని మాధవ్ అన్నారు. ఈ నెల చివరకు పోలవరం నీరు విశాఖకు వస్తుందని చెప్పారు. ఈరోజు కార్యవర్గ సమావేశంలో రెండు తీర్మానాలను ప్రవేశపెడతామని వెల్లడించారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. వాడవాడల్లోకి బీజేపీ పార్టీ వెళ్లాలని సూచించారు. సూర్యుడు ఉదయించాలి... కమలం వికసించాలని పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ బీజేపీని బలోపేతం చేయాలని నిర్దేశించారు. సేవా సంకల్పం పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలునిర్వహిస్తామని మాధవ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 02:11 PM