ఏపీలో మత్స్యకారుల గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:02 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కోనసీమ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈనెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుంచి విశాఖపట్నం చేపల వేటకు మత్స్యకారులు బయలుదేరారు. వేటకు వెళ్లిన గంట నుంచే బోటు నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి. పది రోజుల్లో తిరిగి రావాల్సిన మత్స్యకారులు ఇంతవరకూ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మెరైన్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అధికారులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతు అయిన వారి వివరాలిలా..
కోపనాతి రామకృష్ణ వర్మ, కొమరగిరిపట్నం గ్రామం, అల్లవరం మండలం (బోటు యజమాని)
సంఘాని తాతారావు (58), బలుసుతిప్ప గ్రామం, కాట్రేనికోన మండలం
పాలెపు పాపారావు (30), ఓడలరేవు గ్రామం, అల్లవరం మండలం.
కొల్లాటి శ్రీను (35), ఓడలరేవు గ్రామం, అల్లవరం మండలం.
ఏసుదాసు (45), బెండమూర్లంక గ్రామం, అల్లవరం మండలం
కాటాడి సతీశ్ (38), పశువుల్లంక గ్రామం, పోలవరం మండలం.
కర్రి రాముడు (35), కొమరగిరిపట్నం గ్రామం, అల్లవరం మండలం
వార్తలు కూడా చదవండి...
ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News