ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:45 PM
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణ అవగాహన ఒప్పంద కార్యక్రమం ఈరోజు (ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. 1915లో బ్రిటీష్ వారు కమ్యూనిటీ హాల్‌ను స్టేట్ లైబ్రరీగా మార్చారని ప్రస్తావించారు.
లక్షలాది మందికి ఈ లైబ్రరీ సేవలు అందిస్తుందని పెమ్మసాని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఈ భవనం కూలే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. అందుకే ఈ బిల్డింగ్ నిర్మించేందుకు చల్లా రాజేంద్రప్రసాద్ ముందుకు వచ్చారని అన్నారు. ఆయన వరల్డ్ బెస్ట్ కాఫీ లేబుల్స్‌ను డెవలప్ చేసి ప్రజలకు కాంటినెంటల్ కాఫీని అందిస్తున్నారని వెల్లడించారు. పేద వారు కూర్చొని చదువుకునే విధంగా దాదాపు రూ.20కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అందుకే రాజేంద్రప్రసాద్‌తో స్టేట్ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి ఎంవోయూ చేయిస్తున్నామని చెప్పారు. ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ప్రారంభానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News