Share News

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:59 PM

దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని.. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని.. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ వేదికగా కవిత మీడియాతో మాట్లాడారు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని.. వీటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని ప్రస్తావించారు.


రాష్ట్రంలో డూప్లికేట్ ఓట్లు చాలా ఉన్నాయి..

సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారని కవిత అన్నారు. కొడంగల్‌లో తాము వెరిఫై చేస్తే 33వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వచ్చాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డూప్లికేట్ ఓట్లు చాలా ఉన్నాయని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి 32వేల మెజారిటీతో గెలిచారని అన్నారు. ఈ డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని తమకు అనుమానం ఉందని చెప్పారు. కర్ణాటక నుంచి నోటు ట్రాన్స్‌ఫర్‌తో పాటు ఓటు ట్రాన్స్‌ఫర్‌ అయిందా అనే అనుమానం తమకు కలుగుతోందని కవిత పేర్కొన్నారు.


రాష్ట్రాల మధ్య ఉన్న డేటాను పరిశీలించాలి..

ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ‘సర్’ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న డేటాను వెంటనే పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు ఏపీలో కూడా ఓటు ఉందని... ఎక్కడైనా ఒక చోటు మాత్రమే ఓటు ఉండేలా చూడాలని సూచించారు. ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లను తొలగించాలన్నారు. ఎన్నికల సంఘానికి ఈ విషయాలపై ఫిర్యాదు చేస్తామని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: మంత్రి దామోదర

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 01:56 PM