Share News

ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 28 , 2026 | 09:40 AM

భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పీవీకి ఘనంగా నివాళులర్పించారు.

ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పీవీకి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో పీవీ నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.


స్వాతంత్య్ర సమరయోధుడిగా, బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి గల నాయకుడిగా పీవీ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి భారత ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపించిన మహానేతగా పీవీని కీర్తించారు.


సంక్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, భారత అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేతగా పీవీ నరసింహారావు నిలిచారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ముద్దుబిడ్డగా పీవీ నరసింహారావు సాధించిన విజయాలు రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని, ఆయన సేవలు, ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 09:48 AM