Share News

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:03 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.

సీషెల్స్  పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
PM Narendra Modi

ఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. సీషెల్స్ జాతీయ దినోత్సవంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలు జరగడంతో ఈ పర్యటన మరింత ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు.


సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర సరిహద్దు పొరుగు దేశమని, భారతదేశం చేపట్టిన ‘మహాసాగర్ విజన్’లోనూ, గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ కీలక భాగస్వామిగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో (Patrick Herminie) ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సముద్ర భద్రతా సహకార అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.


అలాగే సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. సీషెల్స్‌లో నివసిస్తున్న భారతీయ సమాజ ప్రతినిధులను కలుసుకునేందుకు కూడా తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.ఈ పర్యటన భారత్–సీషెల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 11:47 AM