కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్ రైలు వేగం పెంపు
ABN , Publish Date - Jun 25 , 2026 | 08:00 AM
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు.
ఆగస్టు 25 నుంచి అమలు
సికింద్రాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు. ఈ రైలు వేగం పెంచడం వల్ల గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. కాచిగూడ - అశోకపురం (12785) రైలు ప్రతిరోజు రాత్రి 7.5నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్లంకా, బెంగళూర్, మైసూర్ మీదుగా అశోకపురానికి మరుసటిరోజు ఉదయం 9.55 నిమిషాలకు చేరుకునేది.
స్పీడ్ పెంచిన తర్వాత 20 నిమిషాలు ముందుగా ఉదయం 9.35 కు చేరుకుంటుందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుగు ప్రయాణంలో అశోకపురం రైల్వేస్టేషన్‌లో (12786) మధ్యాహ్నం 2.55 నిమిషాలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.40 నిమిషాలకు చేరుకునేది. స్పీడ్ పెంచిన తర్వాత 55 నిమిషాల ముందుగానే తెల్లవారుజామున 4.40 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం
Read Latest AP News And Telangana News And International News And Telugu News