Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

ABN , Publish Date - Jun 25 , 2026 | 07:21 AM

టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్
Hyderabad power cut today

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు ఇంద్రసేనారెడ్డి, బొనిగాల విజయప్రకాష్‌, భీమాలింగప్ప వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వసంతనగర్‌ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గోకుల్‌ ఫ్లాట్స్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు గోకుల్‌ ఫ్లాట్స్‌ (వెంకటరమణ కాలనీ) ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


కేపీహెచ్‌బీ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్‌-1, సర్వీస్‌ రోడ్డులోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హౌసింగ్‌బోర్డు ఫంక్షన్‌ హాల్‌, ఇడబ్ల్యూఎస్‌, ఎంఐజీ 600-935, టెంపుల్‌ బస్టాప్‌ ప్రాంతాల్లో.. బాలాజీనగర్‌ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజీవ్‌గాంధీనగర్‌, సర్దార్‌నగర్‌, ఆంజనేయనగర్‌, మహిళా మండలి, మూసాపేట్‌ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెజిస్టిక్‌ విల్లాస్‌, వాసవీ అపార్ట్‌మెంట్స్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


అల్లాపూర్‌, గాయత్రినగర్‌ పరిధిలో..

అల్లాపూర్‌: చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా గాయత్రి నగర్‌, అల్లాపూర్‌ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో నేడు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ రాకేష్‏కుమార్‌ తెలిపారు. అయ్యప్ప సొసైటీ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీ, రోడ్‌ నెం.34, 35, ఆర్‌ఆర్‌ఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, పార్ట్‌ ఆఫ్‌ చందా నాయక్‌ తండా ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు విద్యుత్‌ ఉండదు. రుచి టిఫిన్‌ సెంటర్‌, ప్లాట్‌ నెం.450 టు 490, అయ్యప్ప టెంపుల్‌ ఏరియా, చందానాయక్‌ తండా, మాధాపూర్‌ వైన్స్‌ బ్యాక్‌ సైడ్‌, బీహెచ్‌ఈఎల్‌ ఆఫీస్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


city1.2.jpgపంజాగుట్ట: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణ్‌నగర్‌ పార్కు, దుర్గానగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామారావునగర్‌, మేథడిస్ట్‌ కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఏడీఈ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 07:21 AM