కష్టకాలంలో సువేందు నాకు మద్దతుగా నిలిచారు
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:41 AM
మమత రాజకీయ ప్రత్యర్థి, పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారిపై బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశంసలు కురిపించారు.
బెంగాల్‌లో రాజకీయ సంక్షోభం వేళ మమత ప్రత్యర్థిపై టీఎంసీ ఎంపీ మహువా ప్రశంసలు
కోల్‌కతా, జూన్ 24: మమత రాజకీయ ప్రత్యర్థి, పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారిపై బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశంసలు కురిపించారు. ఈ ఇంటర్వ్యూ, అనంతరం ‘ఎక్స్’ వేదికగా.. సువేందు అధికారితో తనకున్న భావోద్వేగ సంబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్ వస్తుందని అనుకున్నాను. కానీ, రాకపోయేసరికి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో సువేందు నా పక్కన ఉండి ఓదార్చారు.’’ అని ఆమె తెలిపారు. టీఎంసీలో కలిసి పనిచేసిన కాలమంతా తమ మధ్య వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలు ఉండేవని, పార్టీలో తనకు ఆయన మద్దతు ఇచ్చేవారని పేర్కొన్నారు. పార్టీ మారి సువేందు బీజేపీలోకి వెళ్లిన తర్వాత, తిరిగి తాము కలుసుకోలేదన్నారు. కానీ, పార్టీలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు. 2016లో కరీమ్‌పూర్ నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు సువేందు తప్ప, సీనియర్ నాయకులెవరూ తన కోసం ప్రచారం చేయలేదని మహువా తెలిపారు. సువేందుకు రుణపడి ఉంటానని మహువా అన్నారు. అసమర్థులకు మమత సీట్లు ఇవ్వడం వల్లే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని మహువా అన్నారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!