బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారు: జేపీ నడ్డా
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:06 PM
బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో తెలంగాణ ప్రజలు విసిగి పోయారని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు.
హైదరాబాద్, జులై 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో తెలంగాణ ప్రజలు విసిగి పోయారని కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) విమర్శించారు. ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని.. వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్‌లో నడ్డా పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. అనంతరం నడ్డా మాట్లాడారు.
విభేదాలు పక్కన పెట్టి పనిచేయండి..
‘పార్టీ డోర్స్ ఓపెన్ చేయాలని.. వేరే పార్టీ వాళ్లు చేరినప్పుడే బీజేపీ మరింత బలపడుతుంది. నేను హిమాచల్ ప్రదేశ్‌లో అనేక మంది కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరాలా చేస్తున్నా. విభేదాలు పక్కన పెట్టి పనిచేయండి. ఈసారి తెలంగాణలో గెలుస్తున్నాం. మీరు పని చేయాలని.. మీతో పాటు మేము ఉంటాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ నియోజకవర్గం ప్రజలు మిమ్ముల్ని అభిమానించేలా చూసుకోవాలి. కార్యకర్తలతో మంచిగా ఉండాలి. కార్యకర్తలతో మంచిగా లేకుంటే మీరు ఇబ్బంది పడతారు. చిన్నస్థాయి నుంచి కేంద్రమంత్రి వరకు నేను ఎదిగాను. నా సొంత ఆసక్తితో నేను ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పా’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తరహాలోనే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోంది
అలాగే, మేధావుల సదస్సులో జేపీ నడ్డా పాల్గొని మాట్లాడారు.
‘కేసీఆర్ హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయి. అప్పుడు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ తరహాలోనే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ ఏటీఎంలాగా వాడుకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వాడుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని బద్నామ్ చేయడం అలవాటైంది. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఎలా సహకరించిందో ఒకసారి లెక్కలు చూస్తే తెలుస్తోంది’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి లెక్కల్లో వీక్ అనుకుంటా..
దేశంలో నక్సలిజం కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే ఉందని జేపీ నడ్డా తెలిపారు. ‘తెలంగాణలో కోటి 90 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. రేవంత్‌రెడ్డి లెక్కల్లో వీక్ అనుకుంటా. సౌత్ వర్సెస్ నార్త్ అని మాట్లాడుతున్నారు. పన్నుల్లో తెలంగాణకు రూ.2.74 లక్షల కోట్లు వచ్చింది. తెలంగాణలో నేషనల్ హైవేలు, పవర్ ప్రాజెక్టులు, ఎయిమ్స్ వచ్చాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మారింది. ఏటీఎం ప్రభుత్వం ఇక్కడా ఉండాలా..?, ఆ డబ్బులు మీవి, కాళేశ్వరం ఒకప్పుడు ఏటీఎం. పేదలకు ఇస్తానని చెప్పిన డబల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ పోయాయి’ అని జేపీ నడ్డా ప్రశ్నిచారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News