హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా.. బాధితుల ఆరోపణలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:27 PM
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో గల చెరువు పరిధిలో నిర్మాణాలున్నాయంటూ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: నగరంలోని రామాంతపూర్‌లో పెద్దచెరువు పరిధిలో నిర్మాణాలున్నాయంటూ హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. హైడ్రా కూల్చివేతలకు పాల్పడిందంటూ మండిపడ్డారు.
బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని రామాంతపూర్‌లో కొన్నేళ్లుగా ‘మధురా బార్ షెడ్’ను నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ షెడ్ చెరువు పరిధిలో ఉందని.. కూల్చివేస్తామని హైడ్రా అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో కంగారు పడిన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 40 ఏళ్లుగా ప్రభుత్వానికి మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని.. చెరువు పరిధిలో భూమి ఉంటే.. ఇన్నేళ్లుగా పన్నులు ఎందుకు వసూలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ మేరకు స్పందించిన హైకోర్టు.. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి ఆ స్థలం వస్తుందా.. రాదా.. అని తేలేవరకు.. యథాతథ స్థితి(స్టేటస్ కో) ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ .. హైడ్రా అధికారులు షెడ్‌ను కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్ సరిహద్దులను ముందుగా ఖరారు చేసిన తర్వాతే.. హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోయారు. చట్టబద్ధంగా ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం సరైన ప్రక్రియను అనుసరించిన తర్వాతే చర్యలు చేపట్టాలని యజమానులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ విస్తరణ
మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన
హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News