హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:00 AM
కేంద్ర హోం మంత్రిగా అమిత్‌షా హైదరాబాద్‌కు రావచ్చునని.. అయితే దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అమరవీరుల త్యాగాలపై పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడినందుకు ఆయన, ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
జనగణనలో బీసీ కులగణననూ చేర్చాలి
అమిత్‌షాకు మంత్రి పొన్నం డిమాండ్
హైదరాబాద్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రిగా అమిత్‌షా హైదరాబాద్‌కు రావచ్చునని.. అయితే దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అమరవీరుల త్యాగాలపై పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడినందుకు ఆయన, ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు, చైనా సరిహద్దు సమస్యలు వంటి కీలక అంశాలను గాలికొదిలేసి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే అమిత్‌షా పర్యటిస్తున్నారన్నారు. బీసీల స్థితిగతులు మెరుగుపడాలన్నా, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా కులాల వారీ గణాంకాలు తప్పనిసరి అన్నారు.
జగనణనలో బీసీ కులగణననూ చేర్చాలంటూ తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అధికారికంగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ బీజేపీ బీసీ నాయకులు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ తదితరులకు చిత్తశుద్థి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలని అమిత్ షాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాగా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండీ కూటమి ఆధ్వర్యంలో డిల్లీలో నవంబర్ 1న జరగనున్న ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి మండల, బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు సహా ముఖ్య నాయకులందరూ ఢిల్లీకి తరలివెళ్తున్నట్లు చెప్పారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణ
మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన
బ్లాస్టింగ్ జరగలేదు.. మల్లన్నసాగర్‌కు ముప్పు లేదు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News